15 లక్షల ఆస్థి నష్టం రోడ్డునపడ్డ కుటుంబం

VSP: అనకాపల్లి మండలంలో పిసినీకాడ వద్ద గల ఒక మెకానిక్ షెడ్ దగ్ధమైంది. సుమారు 15 లక్షల ఆస్తి నష్టం జరిగింది. లారీ మెకానిక్ తాలూకా మోటార్లు వైర్లు పనిముట్లు బీరువాలో గల ముఖ్యమైన డాక్యుమెంట్లు దగ్దమై పోయాయి. గైపురి శ్రీనివాసరావుకు చెందిన ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి తగలబెట్టినట్టుగా బాధితుడు శ్రీనివాసరావు తెలిపారు. అ నష్టం వల్ల తన కుటుంబం రోడ్డున పడిందని వాపోతున్నాడు.