చిరుత దాడి.. ఏడుగురికి గాయాలు

చిరుత దాడి.. ఏడుగురికి గాయాలు

మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో ఓ చిరుత పులి పట్టపగలే ప్రజలపై దాడికి దిగింది. శివ్‌నగర్‌లోని పార్దీ ప్రాంతంలో నిన్న అటవీ ప్రాంతం నుంచి జనావాసాల్లోకి వచ్చిన చిరుత జనంపై దాడి చేసింది. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు గాయపడగా.. స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు వెంటనే రంగంలోకి దిగి చిరుతను పట్టుకున్నారు.