గ్యాస్ కోసం వినియోగదారుల ఆందోళన
NZB: నగరంలో గ్యాస్ కొరత వినియోగదారులను వేధిస్తోంది. అయితే ఆయా ఏజెన్సీల నిర్వాహకులు కృత్రిమ కొరత సృష్టిస్తూ వినియోగదారులను ఇబ్బందులు పెడుతున్నట్లుగా ఆరోపణలున్నాయి. నగరంలోని తిలక్ గార్డెన్ చౌరస్తా వద్ద ఓ గ్యాస్ ఏజెన్సీ ఎదుట బుధవారం ఉదయం వినియోగదారులు ధర్నా చేపట్టారు. కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.