ఏటికొప్పాక హస్త కళాకారుడికి సత్కారం

ఏటికొప్పాక హస్త కళాకారుడికి సత్కారం

AKP: ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామానికి చెందిన హస్త కళాకారుడు సంతోష్‌ను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ స్థానిక జనసేన కార్యాలయంలో గురువారం సత్కరించారు. కళాకారుడు సంతోష్ రూపొందించిన లక్క బొమ్మల శకటానికి తృతీయ బహుమతి దక్కడం మనందరికీ గర్వకారణం అన్నారు. అనకాపల్లి జిల్లాకు గుర్తింపు తీసుకువచ్చిన సంతోష్‌ను ఎమ్మెల్యే అభినందించారు.