సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ASI.. రూ. 95,500 మాయం
JGL: సైబర్ నేరగాళ్లు పోలీసులను సైతం వదలడం లేదు. జిల్లాలోని పోలీస్ స్టేషన్‌లో ఓ ASIని సైబర్ నేరగాళ్లు బ్లాక్‌మెయిల్ చేసి రూ. 95,500 ఖాజేశారు. ASI కు సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేసి, ఆ కాల్‌రికార్డ్‌ను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో అతడు మూడు విడతలుగా డబ్బు వారి ఖాతాలో జమ చేశాడు. మోసపోయాయని గ్రహించిన ASI పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.