'నవంబర్ లో 101% బొగ్గు ఉత్పత్తి సాధించాం'
MNCL: బెల్లంపల్లి ఏరియా బొగ్గు గనుల ద్వారా నవంబర్‌లో 101% బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు ఏరియా ఇన్ఛార్జ్ GM నరేందర్ తెలిపారు. సోమవారం రెబ్బెన మండలం గోలేటి జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబర్‌లో 3 లక్షల 50 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం కాగా, 3 లక్షల 53 వేల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడం జరిగిందన్నారు.