కూతురి పెళ్లి పనులకు వెళ్లి తండ్రి మృతి
VKB: యలల్ మండలం సగెంకుర్దులో ఆదివారం విషాదకర సంఘటన చోటు చేసుకుంది. కుమార్తె పెళ్లి పనులకు వెళ్లిన అనంతప్ప, తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు అతన్ని తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ అనంతప్ప మృతి చెందారు.