అక్రమ కట్టడాలను కూల్చివేసిన అధికారులు

అక్రమ కట్టడాలను కూల్చివేసిన అధికారులు

ఆసిఫాబాద్: కాగజ్ నగర్ పట్టణంలో అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు కొరడా ఘులిపించారు. గురువారం నాలలపై నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చివేశారు. పూర్తిగా నాలాపై నిర్మించిన VIP పాఠశాల భవనంను అధికారులు కూల్చివేశారు. పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.