ప్రమాదాల నియంత్రణకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు

SRPT: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు స్పీడ్ బ్రేకర్లు ఎంతో కీలకమని సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్సై సాయిరాం అన్నారు. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో విద్యార్థులతో నిత్యం రద్దీగా ఉండే 60 ఫీట్ రోడ్లలో ప్రమాదాల నియంత్రణ కొరకు ఆరు ప్రదేశాలలో స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ఎస్సై సూచించారు.