అకాల వర్షానికి నష్టపోయిన వారిని పరిశీలించిన: ఆర్డీవో

MNCL: నెన్నెల మండలం పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి నష్టపోయిన ఇండ్లను ఆర్డీవో హరికృష్ణ, ఎంపీడీవో మహేందర్, శుక్రవారం సందర్శించారు. పలు ఇళ్లపై కప్పులు లేచిపోయాయన్నారు. చెట్లు విరిగిపోయి రాకపోకలకు ఆటంకం కలిగిందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి అధికారులకు నివేదిక అందజేస్తామన్నారు.