రెండు చేపలు.. రూ.1.65 లక్షలు

రెండు చేపలు.. రూ.1.65 లక్షలు

తమిళనాడు మత్స్యకారుల వలలో చిక్కిన 2 చేపలు రూ.1.65 లక్షల ధర పలికాయి. గల్ఫ్ ఆఫ్ మన్నార్ వద్ద వేటకు వెళ్లిన వారికి 2 పెద్ద క్వాట్ ఫిష్‌లు చిక్కాయి. ఒకటి 22 కిలోలు ఉండగా, మరొకటి 24 కిలోల బరువు ఉంది. ఈ 2 చేపలను కిలో రూ.3 వేల చొప్పున రూ.1.65 లక్షలకు విక్రయించారు. క్వాట్ ఫిష్‌లో గుణాలు ఉంటాయని, వాటిని ఖరీదైన సూప్‌ల తయారీలో ఉపయోగిస్తారని జాలర్లు చెప్పారు.