ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేస్తున్నాం: ఎమ్మెల్యే

ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేస్తున్నాం: ఎమ్మెల్యే

మహబూబ్‌నగర్ 10వ డివిజన్‌ గ్రామసభలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తక్కువ కాలంలోనే ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500కే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు వంటి హామీలను అమలు చేశామని తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుమ్మడ మమత, అధికారులు పాల్గొన్నారు.