హెల్మెట్ ధరించడం వాహనదారుడి బాధ్యత: ఎస్పీ
GDWL: హెల్మెట్ ధరించడం ప్రతి వాహనదారుడి బాధ్యతని, అది ప్రాణాలను కాపాడే రక్షణ కవచమని బుధవారం ఎస్పీ టి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. పిల్లలు తమ ఇంట్లోని పెద్దలకు హెల్మెట్ ధరించాలని గుర్తు చేస్తూ కుటుంబాలను కాపాడే హీరోలుగా మారాలని పిలుపునిచ్చారు. హెల్మెట్ వాడకం ద్వారా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని ఆయన స్పష్టం చేశారు.