కలెక్టర్‌ను కలిసిన గిద్దలూరు ఎమ్మెల్యే
ప్రకాశం: గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజబాబును శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధిపై ఇరువురూ చర్చించారు. ఇటీవల తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు రాష్ట్ర పరిహారం అందేలా చూడాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు నిధులు కేటాయించాలని కోరగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.