VIDEO: కొనసాగుతున్న విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు
NGKL: పదర మండల కేంద్రంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు వేదపండితులతో యజ్ఞం నిర్వహించారు. 5 రోజులపాటు జరిగే ఉత్సవాలు 26 తేదీన ప్రతిష్ఠతో ముగియనున్నాయని కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో యాదవ సంఘం పెద్దలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.