ఘనంగా పైలాన్ ఎల్లమ్మ కళ్యాణం

ఘనంగా పైలాన్ ఎల్లమ్మ కళ్యాణం

NLG: నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల పైలాన్ వద్ద వెంచేసిన శ్రీ రేణుక ఎల్లమ్మ వార్షిక కళ్యాణం సోమవారం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా అర్చకులు మరింగంటి లక్ష్మీనరసింహ చార్యులు రేణుక ఎల్లమ్మ, జమదగ్ని మునిరాజుల కళ్యాణ క్రతువుని వేద మంత్రాల మధ్య శాస్త్రోక్తంగా రెండు గంటల పాటు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.