VIDEO: ఊరేగింపుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు
HYD: శ్రీరామనవమి ఊరేగింపుకు నగరంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ముఖ్య ప్రాంతాల్లో CC టీవీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ కొనసాగుతోంది. సిద్దింబర్ బజార్ సహా ఊరేగింపు మార్గంలోని మసీదులను తెల్లటి వస్త్రాలతో కప్పి శాంతిభద్రతలు కాపాడే చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉండగా వాహనదారులు మందస్తుగా ప్రయాణ ప్రణాళిక చేసుకోవాలని పోలీసులు సూచించారు.