'యూనివర్సిటీ భూముల కేటాయింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి'

హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీలో ఇవాళ అన్ని విద్యార్థి సంఘాల ఉమ్మడి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి యూనివర్సిటీ భూములను కేటాయించడాన్ని విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. స్కూల్ నిర్మాణానికి వేరే చోట స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు.