వేంపల్లిలో తాగునీటి సమస్యపై మహిళల ఆందోళన

వేంపల్లిలో తాగునీటి సమస్యపై మహిళల ఆందోళన

KDP: వేంపల్లి చైతన్య ఏరియా సెంటెన్న వీధిలో మూడు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గురువారం ఆ వీధికి చెందిన మహిళలు EO నాగభూషణ రెడ్డి ఇంటికి చేరుకుని తమ సమస్యను వివరించారు. 'మూడు రోజులుగా నీళ్లు రావడం లేదు సార్ చిన్నా పెద్దా అందరం ఇబ్బందులు పడుతున్నాం' అని వాపోయారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.