గోటూరు టోల్ గేట్ వద్ద రోడ్డు ప్రమాదం
KDP: వల్లూరు మండలం గోటూరు టోల్ గేట్ వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కడప నుంచి కమలాపురం వెళ్తున్న ఆటో, ఎదురుగా వచ్చిన బైక్ బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో పుల్లారెడ్డిపేటకు చెందిన ఆటో డ్రైవర్ సుబ్బరాయుడు, బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వెంటనే చికిత్స కోసం కడప ఆసుపత్రికి తరలించారు.