వార్డు మెంబరుగా ఎన్నిక.. వరించిన అదృష్టం

వార్డు మెంబరుగా ఎన్నిక.. వరించిన అదృష్టం

NLG: చిట్యాల మండలం వెలిమినేడు వార్డు మెంబర్‌గా పోటీ చేసిన ఏనుగు శ్రీకాంత్ రెడ్డికి లక్కీ డ్రా వరించింది. గ్రామంలోని 13వ వార్డుకు ఏనుగు శ్రీకాంత్ రెడ్డి, నెల్లికంటి నరసింహారెడ్డిలు పోటీ చేయగా వారికి సమానంగా 147 ఓట్లు చొప్పున వచ్చాయి. దీంతో అధికారులు లక్కీ డ్రా నిర్వహించగా.. ఏనుగు శ్రీకాంత్ రెడ్డి పేరు రావడంతో వార్డు మెంబరుగా గెలిచినట్లు ప్రకటించారు.