VIDEO: విశాఖలో కోహ్లీ విశ్వరూపం
విరాట్ కోహ్లీ తనకు అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలో విశ్వరూపం చూపించాడు. కేవలం 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. టార్గెట్ తక్కువగా ఉంది కాబట్టి సరిపోయింది కానీ, కోహ్లీ ఊపు చూస్తే ఈ రోజు మరో సెంచరీ బాదేలానే కనిపించాడు. అయితే, ఈ ఇన్నింగ్స్‌లో విరాట్ కొట్టిన 'నో లుక్ షాట్' బౌండరీ అవతల పడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.