ప్రశాంతంగా ముగిసిన జీవశాస్త్రం పరీక్ష
KMM: జిల్లాలో పదో తరగతి జీవశాస్త్రం పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా విద్యాశాఖాధికారిణి చైతన్య జైని మంగళవారం ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా 16,975 మంది విద్యార్థులకు గాను 16,954 మంది హాజరయ్యారని, 99.88% హాజరు నమోదైందని పేర్కొన్నారు. 35 కేంద్రాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించామని అన్నారు.