కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు: CP
NZB: జిల్లాలో మొదటి దశ గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ జరిగిన ప్రతి గ్రామంలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా అక్కడ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు NZB CP సాయి చైతన్య తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ జరుగుతుందన్నారు. మొదట వార్డ్ మెంబర్ల కౌంటింగ్, తదుపరి సర్పంచ్ ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుందన్నారు.