'జనగణన అధికారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించాలి'

'జనగణన అధికారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించాలి'

SRCL: ఏప్రిల్, మే నెలలలో చేపట్టనున్న ఇంటింటి గణన కోసం పర్యవేక్షకులు, గణన అధికారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని స్టేట్ టీచర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మొగిలి లక్ష్మణ్ కోరారు. ఈ మేరకు గురువారం వేములవాడ మున్సిపల్ కమిషనర్, అర్బన్, రూరల్ తహసీల్దార్లకు వినతి పత్రం అందజేశారు. SEEPEC సర్వే చేసిన ఉపాధ్యాయులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.