సోమందేపల్లిలో సీసీ రోడ్డుకు భూమి పూజ

సోమందేపల్లిలో సీసీ రోడ్డుకు భూమి పూజ

సత్యసాయి: సోమందేపల్లి మండలం సాయినగర్‌లో టీడీపీ నాయకులు బుధవారం సీసీ రోడ్డుకు భూమి పూజ చేశారు. హిందూపూర్ పార్లమెంటు టీడీపీ కార్యదర్శి చంద్రశేఖర్, టౌన్ కన్వీనర్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మంత్రి సవిత ఆదేశాల మేరకు సాయినగర్‌లో ప్రజల సౌకర్యార్థం అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.