BREAKING: లిఫ్ట్ కింద పడి బాలుడు మృతి

BREAKING: లిఫ్ట్ కింద పడి బాలుడు మృతి

హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. ఎల్లారెడ్డిగూడలోని కీర్తి అపార్ట్‌మెంట్స్ జీ బ్లాక్ వద్ద లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి బాలుడు మృతి చెందాడు. బాలుడు లిఫ్ట్ డోర్ తెరిచి లోపలికి వెళ్లే ప్రయత్నంలో లిఫ్ట్ కింద ఇరుక్కున్నట్లు సమాచారం. ఇది గమనించిన అపార్ట్ మెంట్ వాసులు బాలుడిని బయటకు తీసేసరికి అప్పటికే మృతి చెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.