నేడు ఖమ్మంలో మంత్రుల పర్యటన

TG: ఖమ్మం జిల్లాలో ఈరోజు మంత్రులు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నారు. రఘునాథపాలెంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీకి మంత్రులు శంకుస్థాపన చేస్తారు. అనంతరం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం ఖమ్మంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు పాల్గొని ప్రసంగిస్తారు.