తణుకులో ఆకట్టుకున్న కృష్ణాష్టమి సంబరాలు

W.G: తణుకు పట్టణంలోని కృష్ణాష్టమి సంబరాలు అంబరాన్నంటాయి. స్థానిక రూట్స్ స్కూలు ప్రాంగణంలోని శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో చిన్నారులు ఉట్టికొట్టే ప్రక్రియను నిర్వహించారు. స్కూలు డైరెక్టర్లు త్రిపాఠి, విద్యాకాంత్, వర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థులు విచిత్ర వేషధారణలతోపాటు కృష్ణుడు, గోపికల వేషధారణలతో విశేషంగా ఆకట్టుకున్నారు.