బాంబు బెదిరింపులపై స్పందించిన డీసీపీ

బాంబు బెదిరింపులపై స్పందించిన డీసీపీ

HYD: శంషాబాద్ విమానాశ్రయానికి తరచూ బాంబు బెదిరింపులు రావడంపై శంషాబాద్ డీసీపీ బి. రాజేష్ స్పందించారు. 'ఈ ఏడాది మొత్తం 20 బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. వీటిల్లో ఐదు మెయిల్స్‌ను  చేధించాం. ప్రయాణికులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బెదిరింపు మెయిల్స్‌లో ఎక్కువ శాతం ఫేక్. అయినా సరే మేము తేలిగ్గా తీసుకోలేదు' అని పేర్కొన్నారు.