వందేమాతరం గేయం అలపించిన కలెక్టర్
MHBD: 'వందేమాతరం' జాతీయ గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఈ గేయాన్ని సామూహికంగా అలపించారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, అనిల్ కుమార్, ఇతర శాఖల అధికారులు అందరూ కలిసి జాతీయ గేయం పాడ్డారు.