ప్రాజెక్టు ఇంజనీర్లతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

NLG: నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నుంచి మునుగోడు మండలంలోని భూములకు సాగునీరు అందించాలని లక్ష్యంతో, మునుగోడు MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం HYDలోని తన నివాసంలో ప్రాజెక్టు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఉరుమడ్ల వరకే ఉన్న BVL లెఫ్ట్ మెయిన్ కెనాల్‌ను కిష్టాపురం వరకు 11.5 కి.మీ మేర విస్తరించాలన్నారు.