'నాణ్యత లోపం లేకుండా మరమ్మతులు చేయాలి'

WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ సమావేశ మందిరం రూ.2కోట్ల నిధులతో మరమ్మత్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరమ్మతుల పనులను శనివారం నగర మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ.. నాణ్యత లోపం లేకుండా మరమ్మతులు చేయాలని ఆదేశించారు.