కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే
BHNG: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రామన్నపేట మండలం శోభనాద్రిపురం, లక్ష్మాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు అల్లేటి పరమేష్, బత్తుల జ్యోతిని గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయా గ్రామాల్లో జరిగిన సభల్లో మాట్లాడారు.