తుంగపాడులో అధ్వానంగా రోడ్లు, పారిశుధ్యం
NLG: నాంపల్లి మండలం తుంగపాడు గ్రామ పంచాయతీలో 60 ఏళ్ల క్రితం వేసిన రోడ్డు ఇప్పటికీ మరమ్మతులు జరగలేదు. ఇటీవల వర్షాలతో రోడ్డు దుస్థితి మరింత పెరిగింది. మురికి కాలువలు లేక నీరు నిలిచిపోవడంతో ఈగలు, దోమలు, విషసర్పాలు ఇళ్లలోకి వస్తున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.