బైక్ చోరీ.. కేసు నమోదు
NRPT: కృష్ణ మండలం గుడెబల్లూరులో బైక్ దొంగతనం జరిగింది. గ్రామానికి చెందిన బొండా అంజి ఇంటి ముందు పార్క్ చేసిన తన బైక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో దొంగిలించారు. ఉదయం లేచి చూసిన అంజి బైక్ కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు నమోదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.