పోచమ్మ తల్లికి బోనాలు
MDK: అల్లాదుర్గం బేతాళ స్వామి జాతర ఉత్సవాల్లో పోచమ్మ దేవతకు భక్తులు బోనాలు సమర్పించారు. పోచమ్మ తల్లిని స్మరిస్తూ భక్తిశ్రద్ధలతో, డప్పు వాయిద్యాలు, శివసత్తులతో పురవీధుల్లో ఊరేగింపుగా వెళ్లి పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. ప్రదక్షిణలు చేసి భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు