మార్కెట్ అభివృద్ధికి సాకారం అందిస్తా: ఎమ్మెల్యే

మార్కెట్ అభివృద్ధికి సాకారం అందిస్తా: ఎమ్మెల్యే

HYD: సమస్యలను తెలుసుకునేందుకు ఎమ్మెల్యే శ్రీగణేష్ శుక్రవారం బోయిన్‌పల్లి మార్కెట్‌ను పరిశీలించారు. రైతులు, వ్యాపారులు, హమాలీలతో మాట్లాడారు. వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోనే అతి పెద్దదైన బోయిన్‌పల్లి మార్కెట్లో మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని తెలిపారు.