IPSగా ఏటూరునాగారం యువకుడు

IPSగా ఏటూరునాగారం యువకుడు

MLG: మారుమూల అటవీ గ్రామీణ ప్రాంతంలో పేదరికం మధ్య పెరిగిన యువకుడు దైనంపల్లి ప్రవీణ్ తన పట్టుదలతో దేశ స్థాయి విజయాన్ని అందుకుని అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఏటూరునాగారంకి చెందిన ఆయన గ్రూప్–1లో 105 ర్యాంక్‌తో డీఎస్పీగా ఎంపిక కాగా.. తాజాగా ప్రకటించిన UPSC సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో 793వ ర్యాంక్ సాధించి మరోసారి తన ప్రతిభను నిరూపించాడు.