53 రోజులుగా అలుగు పారుతున్న మల్క చెరువు
MDK: నిజాంపేటలోని మల్క చెరువు మత్తడి ఈ ఏడాది ఒక విశేష ఘట్టాన్ని నమోదు చేసింది. సాధారణంగా భారీ వర్షాలు కురిసినప్పుడు రెండు నుంచి మూడు వారాలపాటు మాత్రమే అలుగు పారే ఈ చెరువు, ఈసారి ఏకధాటిగా 53 రోజులుగా అలుగు పారుతోంది. స్థానికులు, ముఖ్యంగా రైతులు దీన్ని శుభసూచకంగా భావిస్తున్నారు. దీపావళి వరకు అలుగు ఇలా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.