వేంకటేశ్వర జంతుశాలకు కొత్త జంతువులు

వేంకటేశ్వర జంతుశాలకు కొత్త జంతువులు

TPT: శ్రీవేంకటేశ్వర జూకు కొత్తగా జంతువులను తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. గుజరాత్‌లోని రాధాకృష్ణ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ సహకారంతో ఒక జత రెడ్-నెక్ట్ వాలాబీలు, ఒక జత మీర్కాట్స్, ఒక జత కామన్ మార్మోసెట్స్ కోతులను జూకు తరలించారు. వీటిని ప్రస్తుతం సంజీవని బ్లాక్‌లో ప్రత్యేక నివాసాల్లో ఉంచి క్వారంటైన్ పూర్తయ్యే వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నారు.