కౌంటింగ్ కేంద్రంలో సోమ్మసిల్లి పడిపోయిన సర్పంచ్ అభ్యర్థి
SRD: అర్జున్ నాయక్ తండాలో రెండో విడత పోలింగ్ పూర్తయిన అనంతరం కౌంటింగ్ అధికారులు ఓట్ల లెక్కింపును మొదలుపెట్టారు. ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రంలో ఉన్న సర్పంచ్ అభ్యర్థిని సవితబాయి ఒక్కసారిగా సొమ్మసిల్లి కింద పడిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆమె ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తెలియాల్సి ఉంది.