పరువు పోయిందని బాధతో వ్యక్తి సూసైడ్.!

పరువు పోయిందని బాధతో వ్యక్తి సూసైడ్.!

NLG: పరువు పోయిందని బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన దేవరకొండలో చోటుచేసుకుంది. పట్టణంలోని అంజయ కాలనికి చెందిన వర్దం దశరథం(44) అనే తాపీ మేస్త్రి అదే కాలనికి చెందిన కొందరు తమ ఫ్లెక్సీని చింపాడనే ఆరోపణతో తీవ్రంగా కొట్టారు. దీంతో మనస్తాపానికి గురైన దశరథం తన ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయాడు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.