గోతులమయంగా మారిన రామసముద్రం రోడ్డు

CTR: పుంగనూరు పట్టణం నుండి రామసముద్రంకు వెళ్లే రోడ్డు మార్గం గోతులమయంగా మారింది. గత రెండు మూడు రోజుల నుంచి కురిసిన వర్షానికి ఈ గోతులలో నీరు నిలవడంతో వాహనదారులు ప్రయాణించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రహదారిలో చాలా చోట్ల ఈ విధంగా గోతులు ఉన్న ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోవడంలేదని ఆదివారం సాయంత్రం వాహనదారులు, స్థానికులు తెలిపారు.