‘నారీ శక్తి వందన్’ బిల్లు అమలు చేస్తాం: మంత్రి
VSP: మహిళలకు చట్టసభల్లో ప్రాధాన్యత కల్పించే ‘నారీ శక్తి వందన్ అధినియం’ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి విజయవంతం చేస్తామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విశాఖలో జరిగిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, వచ్చే ఎన్నికల నుంచే రిజర్వేషన్లు అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.