జేసీబీ నడిపిన మంత్రి నారా లోకేష్

ATP: గుత్తి మండలం బేతపల్లిలో రూ. 22 వేల కోట్ల పెట్టుబడులతో రెన్యూ సంస్థ చేపట్టిన సోలార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. మంత్రులు లోకేష్, రవికుమార్, కలెక్టర్ వినోద్ కుమార్, రెన్యూ సంస్థ ఛైర్మన్ సుమంత్ సిన్హా, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ జేసీబీ నడిపి ప్రాజెక్టు పనులను ప్రారంభించారు.