వారిపై కలెక్టర్ సీరియస్

ప్రకాశం: జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో కొందరు అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్ తమీమ్ అన్సారియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో, జిల్లాలోని పలు వైద్యశాలల్లో కనిపిస్తున్న నిర్లక్ష్యంపై ఆయన ప్రశ్నించి జిల్లాకే చెడ్డపేరు వస్తోందని కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు.