VIDEO: 'ధాన్యం కొనుగోలు త్వరగా పూర్తి చేయాలి'
MDK: నిజాంపేట్ మండలం చెల్మెడ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం 2025-26 వానకాలం వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, నీడ మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.