ప్రమాదాలకు నిలయంగా అంబేద్కర్ చౌరస్తా
VKB: కొడంగల్ అంబేద్కర్ చౌరస్తా ప్రమాదాలకు నిలయంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చౌరస్తా ఇరుకుగా ఉండటం, విస్తరణ పనుల్లో జాప్యం కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి లారీ ఢీకొనడంతో అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన గ్రానైట్ బండలు ఊడిపోయాయి. అధికారులు వెంటనే విస్తరణ పనులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.