ఆదోని జిల్లా ఉద్యమానికి ఆర్టీసీ రిటైర్డ్ సంఘ మద్దతు
KRNL: ఆదోని జిల్లా ఏర్పాటుకై జరుగుతున్న ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ఎమ్మిగనూర్ జేఏసీ నాయకులు ఎమ్మిగనూర్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘాన్ని మంగళవారం కోరారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఆదోని జిల్లా ఏర్పాటుతో ప్రాంత అభివృద్ధి, రోడ్ అభివృద్ధి వేగవంతమవుతుందని తెలిపారు. ఉద్యమానికి అన్ని వర్గాలు ఐక్యంగా నిలవాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.